తెలంగాణ అప్పుల్లో మునిగిపోయింది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
- రుణ వ్యవధిని ఏకంగా నలబై ఏళ్లకు పెంచారు
- కొడుకును సీఎం గా చేయాలని కేసీఆర్ కంటున్న కల నెరవేరదు
- భవిష్యత్తులో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం అసంభవం
రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫణంగా పెట్ట రుణ వ్యవధిని 40 ఏళ్లకు పెంచారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని చెప్పిన మాట మర్చి తన కుటుంబానికి మాత్రం పదవులు పంచుతున్నారని విమర్శించారు. తన కొడుకును సీఎంగా చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారని.. కానీ అది నెరవేరదన్నారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం అసంభవమన్నారు. పదవులు లేకుండా కేసీఆర్ కుటుంబం ఒక్క క్షణం కూడా ఉండజాలదని విమర్శించారు.