'మత్తు వదలరా'పై స్పందించిన ప్రభాస్
- కొత్త కుర్రాళ్లు చేసిన కొత్త ప్రయోగం 'మత్తు వదలరా'
- తొలిరోజునే పాజిటివ్ టాక్
- సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు
ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు సైతం తమదైన శైలిలో స్పందించారు. తాజాగా ప్రభాస్ కూడా 'మత్తు వదలరా' టీమ్ తో కలిసి ఈ సినిమా చూశాడు. ఈ సినిమా ఎలా వుంది? కొత్త దర్శకుడి టేకింగ్ ఎలా వుంది? సాంకేతిక నిపుణుల పనితీరు .. ఆయా పాత్రలలో నటీనటుల నటన ఎలా వుంది? మొదలైన అంశాలను గురించి ప్రభాస్ మాట్లాడాడు. ఆ వీడియోను ఈ సినిమా టీమ్ రేపు వదలనుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ .. ప్రభాస్ తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.