'అశ్వథ్థామ' టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
- యాక్షన్ హీరోగా కనిపించిన నాగశౌర్య
- సొంత బ్యానర్ పై చేస్తున్న సాహసం
- కథానాయికగా కనిపించనున్న మెహ్రీన్
యూ ట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతూ, 24 గంటల్లోనే 4.1 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను సాధించింది. ఈ సినిమాలో పోసాని ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ వున్న నాగశౌర్య యాక్షన్ హీరోగా భారీ ఫైట్లు చేస్తూ కనిపించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకి కథను రెడీ చేసింది కూడా నాగశౌర్యనే కావడం మరింత ఆసక్తిని పెంచే అంశం.