నితిన్ చేతుల మీదుగా 'శశి' ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్
- ఆది సాయికుమార్ హీరోగా 'శశి'
- డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఆది
- కథానాయికగా కనిపించనున్న సురభి
ఆది సాయికుమార్ హీరోగా 'శశి' చిత్రం రూపొందుతోంది. ఆది సాయికుమార్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ వదిలిన ఈ ఫస్టులుక్ పోస్టర్లో, ఆయన విభిన్నమైన లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా 'సురభి' నటిస్తోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా తన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని ఆది సాయికుమార్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.