మళ్లీ ఇంతకాలానికి రజనీ సరసన ఖుష్బూ
- విడుదలకి ముస్తాబవుతున్న 'దర్బార్'
- రజనీ తదుపరి సినిమాకి సన్నాహాలు
- గతంలో రజనీ జోడీగా మెప్పించిన ఖుష్బూ
కొంతకాలంగా రజనీ తన సినిమాల్లో కుర్ర హీరోయిన్లు కాకుండా సీనియర్ హీరోయిన్స్ వుండేలా చూసుకుంటున్నారు. ఈ కారణంగానే 'కాలా'లో ఈశ్వరీరావు .. 'పేటా'లో సిమ్రాన్ ఆయన సరసన కనిపించారు. ఈ సారి ఖుష్బూను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో రజనీ - ఖుష్బూ కాంబినేషన్లో వచ్చిన 'అన్నామలై' .. 'మన్నన్' .. 'పాండియన్' చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. మళ్లీ ఇంతకాలానికి ఈ జోడీని తెరపై చూసే అవకాశం లభించడం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే.