టీడీపీకి రాజీనామా లేఖ పంపిన దేవినేని అవినాశ్
- కడియాల బుచ్చిబాబు కూడా రాజీనామా
- వైసీపీలో చేరనున్న అవినాశ్
- టీడీపీలో గుర్తింపు లభించడంలేదని అవినాశ్ అసంతృప్తి
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన దేవినేని అవినాశ్.. ఏపీ యువతలో మంచి పట్టున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగగా, పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చివరకు ఆయన ఈ రోజు వైసీపీలో చేరనున్నారు.