'సైరా'లో కనిపించని 8 కోట్ల సాంగ్.. చరణ్ నిర్ణయం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
- దేశభక్తి చిత్రంగా రూపొందిన 'సైరా'
- పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు
- యూట్యూబ్ లో రిలీజ్ చేయమంటున్న ఫ్యాన్స్
అయితే కథాగమనానికి ఈ పాట అడ్డుపడుతోందని భావించారు. ఎక్కడా ఇరికించే ప్రయత్నం చేయవద్దని చరణ్ చెప్పడంతో పక్కన పెట్టేశారు. అంత ఖరీదైన పాట ఎలా వుందో .. ఏ స్థాయిలో చిత్రీకరించారో అనే ఆసక్తి మెగా అభిమానుల్లో వుండిపోయింది. ఈ పాటను చూడాలనే కుతూహలంతో, యూట్యూబ్ లో విడుదల చేయవలసిందిగా వాళ్లంతా చరణ్ ను కోరుతున్నారు. సోషల్ మీడియా ద్వారా చరణ్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి చరణ్ ఏం చేస్తాడో చూడాలి.