'నిశ్శబ్దం' నుంచి టీజర్ వస్తోంది
- అనుష్క చుట్టూ తిరిగే కథతో 'నిశ్శబ్దం'
- ముఖ్య పాత్రల్లో అంజలి - షాలినీ పాండే
- ఈ నెల 6వ తేదీన టీజర్ విడుదల
తెలుగులో 'నిశ్శబ్దం'అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి టీమ్ సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన సాయంత్రం 5 గంటలకి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. టీజర్ తో మరింతగా అంచనాలు పెంచడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిత్రకారిణిగా అనుష్క కనిపించే ఈ సినిమాలో మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే ముఖ్యమైన పాత్రలను పోషించారు.