సిక్స్ ప్యాక్ తో కనిపించనున్న విజయ్ దేవరకొండ
- త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'ఫైటర్'
- జిమ్ లో విజయ్ దేవరకొండ కసరత్తు
- జాన్వీ కపూర్ కోసం పూరి ప్రయత్నాలు
టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆహార నియమాలు పాటిస్తున్నాననీ, జిమ్ లో గట్టిగానే కసరత్తులు చేస్తున్నానని విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పాడు. 'అర్జున్ రెడ్డి'ని మించి తన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని అన్నాడు. ఇక ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ ను పెంచడం కోసం, విజయ్ దేవరకొండ జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ డేట్స్ కోసం పూరి ట్రై చేస్తున్నాడు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి మరి.