దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే శక్తి సినిమాకు ఉందని ప్రధానితో చెప్పాం: దిల్ రాజు
- ప్రధాని నివాసంలో చేంజ్ విత్ ఇన్ కార్యక్రమం
- హాజరైన దిల్ రాజు
- సినీ రంగం గురించి ప్రధానితో చర్చ
ప్రధాని నరేంద్ర మోదీని కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని 'చేంజ్ విత్ ఇన్' కార్యక్రమం నిర్వహించారని, ఈ సందర్భంగా సినిమా రంగం గురించి చర్చించామని దిల్ రాజు వెల్లడించారు. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే శక్తి సినిమా రంగానికి ఉందన్న విషయాన్ని ప్రధానికి వివరించామని పేర్కొన్నారు.