చిరూ సరసన నాయికగా త్రిష?
- తెలుగు .. తమిళ భాషల్లో క్రేజ్
- '96' హిట్ తో పుంజుకున్న అవకాశాలు
- చిరూ 152వ సినిమాలోనూ ఛాన్స్
ఈ నేపథ్యంలోనే చిరంజీవి తాజా చిత్రంలో కథానాయిక పాత్ర కోసం త్రిషను అడుగుతున్నట్టుగా సమాచారం. చిరంజీవి తన 152వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం త్రిషను సంప్రదిస్తున్నారట. ఇది మామూలు కాంబినేషన్ కాదు గనుక ఆమె అంగీకరించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. గతంలో చిరంజీవి సరసన త్రిష 'స్టాలిన్' సినిమా చేసిన సంగతి తెలిసిందే.