కీర్తి సురేశ్ 'పెంగ్విన్' మూవీ నుంచి ఫస్టులుక్
- కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పెంగ్విన్'
- ప్రధాన పాత్రధారిగా కీర్తి సురేశ్
- ఆసక్తిని రేకెత్తిస్తోన్న పోస్టర్
ఈ పోస్టర్ లో ఆమె గర్భవతిగా కనిపిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్టోన్ బెంచ్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంతోష్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని కీర్తి సురేశ్ భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.