కార్తికేయ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్
- కార్తికేయ నుంచి '90ML'
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
'వినిపించుకోరు వినిపించుకోరు అమ్మాయిలెవ్వరూ వినిపించుకోరు' అనే పాటను విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం .. చంద్రబోస్ సాహిత్యం .. రాహుల్ సిప్లి గంజ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ప్రియురాలి కోపానికి గురైన కథానాయకుడు, తన తాగుబోతు బృందంతో కలిసి అమ్మాయిల ధోరణి పట్ల అసహనాన్ని వ్యక్తం చేసే సందర్భంలో వచ్చే పాటగా అనిపిస్తోంది. మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసేదిగానే ఈ పాట వుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.