'బిగిల్' ట్రైలర్ తో మరో రికార్డును సొంతం చేసుకున్న విజయ్
- అట్లీ కుమార్ తో విజయ్ మూడో మూవీ
- రెండు విభిన్నమైన పాత్రల్లో విజయ్
- దీపావళికి ప్రేక్షకుల ముందుకు
ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. వారం తిరక్కముందే ఈ ట్రైలర్ 29 మిలియన్ల వ్యూస్ ను .. 2 మిలియన్ల లైక్స్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డును సృష్టించింది. ఫుట్ బాల్ కోచ్ గా యంగ్ లుక్ తోను .. మాంసం వ్యాపారం చేసే మధ్యవయస్కుడి పాత్రలోను విజయ్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార కనిపించనుంది. విజయ్ కి .. అట్లీ కుమార్ కి ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.