నేటి సాయంత్రం వీవీ వినాయక్ హీరోగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్
- వినాయక్ ప్రధానపాత్రలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రం
- దర్శకుడిగా ఎన్.నరసింహ
- ఠాగూర్ లో చిన్న పాత్ర పోషించిన వినాయక్
వీవీ వినాయక్ లో మంచి నటుడు ఉన్నాడని ఇండస్ట్రీ ఎప్పుడో గుర్తించింది. ఠాగూర్ చిత్రంలో ఆయన ఓ చిన్నపాత్ర పోషించినా, తనలోనూ ఓ నటుడు ఉన్నాడని చాటుకున్నారు. మరి, నటుడిగా కొత్త ఇన్నింగ్స్ ఎలా సాగుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఇక, వినాయక్ ను లీడ్ రోల్ లో పరిచయం చేస్తున్న చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ దక్కించుకున్న ఎన్.నరసింహ గతంలో దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ వద్ద శిష్యరికం చేశాడు.