గోదావరిలో బోటు ప్రమాదంపై ఎంపీ హర్షకుమార్ పిటిషన్.. విచారిస్తున్న సుప్రీంకోర్టు
- ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి
- మృత దేహాలను వెంటనే వెలికి తీసేలా ఆదేశాలను ఇవ్వండి
- విచారణలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకునేలా ఆదేశించండి
మరోవైపు, బోటు ప్రమాదానికి సంబంధించి ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బోటులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 90 మందికి పైగానే ఉంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో, హర్షకుమార్ పై పోలీసు కేసు నమోదైంది. ఆయన కోసం పోలీసు టీములు గాలిస్తున్నాయి.