తెలుగు రాష్ట్రాల్లో 'సైరా' తొలిరోజు వసూళ్లు
- చిరూ 151వ సినిమా 'సైరా'
- తొలిరోజు షేర్ 38.76 కోట్లు
- ఆసక్తిని పెంచేసిన ప్రత్యేకతలు
చిరంజీవి కెరియర్లో ఇది తొలి చారిత్రక చిత్రం కావడం .. ఈ భారీ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరించడం .. దర్శకుడిగా తనకి వచ్చిన అవకాశాన్ని సురేందర్ రెడ్డి ఛాలెంజింగ్ గా తీసుకోవడం .. భారీ తారాగణం ఈ కథలో భాగస్వాములు కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇన్ని రకాల ప్రత్యేకతల కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లతో దూసుకుపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.