నిహారిక నుంచి 'మ్యాడ్ హౌస్' వెబ్ సిరీస్
- నిహారిక నుంచి మరో వెబ్ సిరీస్
- రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సాగే కథ
- టైటిల్ గా 'మ్యాడ్ హౌస్' ఖరారు
తాజాగా ఆమె తన సొంత బ్యానర్ అయిన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మాతగా మరో వెబ్ సిరీస్ కి శ్రీకారం చుట్టేసింది. రొమాంటిక్ కామెడీ డ్రామాతో నడిచే ఈ వెబ్ సిరీస్ లో నాయకా నాయికలుగా సంతోష్ - కృతి సింగ్ కనిపించనున్నారు. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ సిరీస్ కి 'మ్యాడ్ హౌస్' అనే టైటిల్ ను ఖరారు చేసేసి, యూట్యూబ్ లో ప్రోమోను కూడా వదిలారు. ఈ వెబ్ సిరీస్ 100 ఎపిసోడ్లుగా ప్రసారం కానున్నట్టుగా తెలుస్తోంది. ఈఇక ఇది ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.