కార్తికేయ హీరోగా '90 ML' .. టీజర్ వచ్చేస్తోంది
- శేఖర్ రెడ్డి దర్శకుడిగా '90 ML'
- ఈ నెల 21వ తేదీన టీజర్ రిలీజ్
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
తాజాగా హీరోగా అయన మరో సినిమా చేస్తున్నాడు. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి '90 ML' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అశోక్ గుమ్మకొండ నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటల 35 నిమిషాలకి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచే దిశగా కసరత్తు జరుగుతోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.