విజయ్ దేవరకొండతో పూరి సినిమా కథ అది కాదట
- పూరితో విజయ్ దేవరకొండ
- నవంబర్లో రెగ్యులర్ షూటింగుకి
- వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమా కథ డాన్ కి .. అతని కొడుక్కి మధ్య నడుస్తుందనీ, డాన్ గా ఒక సీనియర్ హీరో నటిస్తాడనే ప్రచారం రెండు మూడు రోజులుగా జరుగుతోంది. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. ప్రేమకథా నేపథ్యంలోనే ఈ సినిమా వుంటుందట. విజయ్ దేవరకొండ మార్క్ ప్రేమకథతో .. పూరి మార్క్ సినిమాగానే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.