కృష్ణవంశీ సినిమా కోసం శంకర్ సినిమాను వదులుకున్న అడివి శేష్
- విభిన్నమైన చిత్రాలతో సక్సెస్
- విలక్షణమైన పాత్రలతో గుర్తింపు
- అలా జరిగిందన్న అడివి శేష్
అయితే అప్పటికే నేను కృష్ణవంశీగారు చేయనున్న 'మల్లెపువ్వు' సినిమా కోసం ఎంపిక అయ్యాను. 'ఇలా 'బాయ్స్' సినిమాలో ఛాన్స్ వచ్చిందనే విషయాన్ని కృష్ణవంశీ గారికి చెప్పాను. 'మల్లెపువ్వు' చేస్తావో .. 'బాయ్స్' చేస్తావో నువ్వే ఆలోచించుకో' అని నిర్ణయాన్ని ఆయన నాకే వదిలేశారు. తమిళంలో 'బాయ్స్' చేయడం కన్నా, తెలుగులో రూపొందే 'మల్లెపువ్వు' చేయడమే మంచిదనే ఉద్దేశంతో శంకర్ సినిమాను వదులుకున్నాను. తీరా చూస్తే 'మల్లె పువ్వు' సినిమా ఆగిపోయింది .. 'బాయ్స్'లో చేసిన వాళ్లందరికీ మంచి పేరు వచ్చింది' అని చెప్పుకొచ్చాడు.