విజయ్ దేవరకొండ హీరోగా భారీ బాలీవుడ్ మూవీ?
- యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్
- బాలీవుడ్ బడా నిర్మాతల దృష్టిని ఆకర్షించిన హీరో
- బహు భాషా చిత్రంలో ఛాన్స్ అంటూ టాక్
తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విజయ్ దేవరకొండకి గల క్రేజ్ ను గుర్తించిన కరణ్ జొహార్ .. సిద్ధార్థ్ రాయ్ కపూర్ .. సాజిద్ నడయాడ్ వాలా, ఈ హీరోతో ఒక భారీ సినిమాను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోలో హీరోగా కనిపిస్తాడా? వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటాడా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.