'పెళ్లి చూపులు' నిర్మాత తనయుడు హీరోగా 'చూసీ చూడంగానే' .. ఫస్టులుక్ రిలీజ్
- మరో ప్రేమకథగా 'చూసీ చూడంగానే'
- నాయకా నాయికల తొలి సినిమా
- సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు
శేష సింధూరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి, దగ్గుబాటి సురేశ్ బాబు చేతుల మీదుగా ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయించారు. తన కెమెరాలో ఏదో దృశ్యాన్ని బంధిస్తూ ఈ పోస్టర్లో శివ కందుకూరి కనిపిస్తున్నాడు. ఈ సినిమాతోనే 'వర్ష' అనే తెలుగు అమ్మాయి కథానాయికగా పరిచయం కానుంది. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయనున్నారు.