'గుణ 369' పైనే కార్తికేయ ఆశలు
- 'హిప్పీ'తో ఫ్లాప్ చూసిన కార్తికేయ
- 9 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన 'గుణ 369'
- 12 కోట్ల మేర జరిగిన బిజినెస్
'అనఘ' కథానాయికగా 9 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, థియేట్రికల్ .. నాన్ థియేట్రికల్ కలుపుకుని 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్టుగా సమాచారం. కార్తికేయ చేసిన 'ఆర్ ఎక్స్ 100' సినిమా, పెట్టుబడికంటే ఏడెనిమిది రెట్లు అధికంగా వసూలు చేసి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో 'గుణ 369' కూడా ఆ స్థాయిలో వసూలు చేయాలని కార్తికేయ భావిస్తున్నాడట. ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి.