జీవితంలో నేను కోరుకున్నది ఒక్కటే .. అది నెరవేరింది: బాబా మాస్టర్
- నేను పుట్టి పెరిగింది చెన్నైలో
- మాస్టర్ గా తొలి ఛాన్స్ ధనుశ్ ఇచ్చాడు
- 'సింగం' సినిమా అవార్డు తెచ్చిపెట్టింది
నేను డాన్స్ మాస్టర్ గా ఎదిగి బెస్ట్ కొరియోగ్రఫర్ గా మా నాన్న చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలనేది నా కోరిక. దాంతో శివశంకర్ మాస్టర్ .. రాజు సుందరం మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాను. డాన్స్ మాస్టర్ గా తొలిసారి ధనుశ్ సినిమా చేశాను. సూర్య హీరోగా చేసిన 'సింగం' సినిమాతో బెస్ట్ కొరియోగ్రఫర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. ఆ అవార్డును మా నాన్న చేతుల మీదుగా అందుకున్నాను. అలా నా కోరిక నెరవేరింది" అని చెప్పుకొచ్చాడు.