'డియర్ కామ్రేడ్' చేసినందుకు గర్వంగా వుంది: విజయ్ దేవరకొండ
- నాలుగు భాషల్లో నిన్న విడుదలైన 'డియర్ కామ్రేడ్'
- తెలుగులో భారీ ఓపెనింగ్స్
- సక్సెస్ టాక్ పట్ల విజయ్ దేవరకొండ ఆనందం
ఈ వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "నా కెరియర్లో నేను చేసిన ఈ సినిమా మొదటిసారిగా నాలుగు భాషల్లో విడుదలైంది. నాలుగు భాషల్లోని ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ఏడాది పాటు ఈ సినిమా కోసం అందరం కలిసి కష్టపడ్డాం. ఈ సినిమాలో నేను చేసిన 'బాబీ' పాత్రను ఎప్పటికీ మరిచిపోలేను. 'డియర్ కామ్రేడ్' నా కెరియర్లో ప్రత్యేకమైన సినిమా. నాకెంతో ఇష్టమైన ఆల్బమ్ కూడా ఇదే. ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకున్నందుకు నాకు చాలా గర్వంగా వుంది" అని చెప్పుకొచ్చాడు.