నేను నాలాగే వుంటాను .. ఎవరి కోసమో మారను: విజయ్ దేవరకొండ
- ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ కావడం ఇష్టం ఉండదు
- నాకు నచ్చిన కథలను చేస్తాను
- నాలా నేను ఉండటానికే ఇష్టపడతాను
ఇలాంటివి చేయవచ్చుగదా .. అలాంటివి చేయవచ్చుగదా అని చాలామంది నాకు సూచనలు చేస్తుంటారు. ఎవరినైనా సరే ఇలాగే ఉండాలి అని ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ చేయడం కరెక్ట్ కాదు. చిన్నప్పుడు అలాగే ఉండేవాడిని. ఎదుగుతున్న కొద్దీ కష్టాలు మొదలయ్యాయి. నా స్టైల్లోనే వాటితో యుద్ధం చేస్తూ వచ్చాను. ఆ కష్టాలే నన్ను మార్చేశాయి. నేను ఎలా ఉండాలనేది చెప్పాయి. ఇకపై ఇలాగే వుంటాను .. అది కొంతమందికి నచ్చచ్చు .. మరికొంతమందికి నచ్చకపోవచ్చు. అయినా నేను నాలాగే వుంటాను" అని చెప్పుకొచ్చాడు.