నటి రాధిక దంపతుల అరెస్ట్ కు కోర్టు ఆదేశాలు!
- రేడియన్స్ కు ఇచ్చిన చెక్ బౌన్స్
- కోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థ
- స్పందించకపోవడంతో అరెస్ట్ కు ఆదేశం
లిస్టిన్ స్టీఫెన్ తో కలిసి శరత్ కుమార్, రాధికలు సినిమాలు నిర్మించిన వేళ, రేడియన్స్ నుంచి రుణం తీసుకుని, దాన్ని తీర్చేందుకు రూ. 2 కోట్లకు పైగా చెక్కిచ్చారు. ఇది బౌన్స్ కావడంతో సదరు సంస్థ సైదాపేట కోర్టును ఆశ్రయించింది. తాజాగా, వారిని అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేస్తూ, కేసు తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేశారు.