డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న బన్నీ
- త్రివిక్రమ్ తో బన్నీ సినిమా
- తదుపరి ప్రాజెక్టు వేణు శ్రీరామ్ తో
- బన్నీని కొత్తగా చూపించనున్న వేణు శ్రీరామ్
ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో బన్నీ యంగ్ ఏజ్డ్ లోనే కాకుండా మిడిల్ ఏజ్డ్ గెటప్పులోను కనిపిస్తాడట. ఈ రెండేకాదు ఇంకా ఒకటి రెండు గెటప్పులతోను సందడి చేస్తాడని చెబుతున్నారు. ఇలా డిఫరెంట్ గెటప్స్ తో .. కాస్ట్యూమ్స్ తో బన్నీ కనిపిస్తాడని అంటున్నారు. ఈ కథలోని కొత్తదనం .. పాత్రలోని వైవిధ్యం కారణంగానే సుకుమార్ ప్రాజెక్టుకంటే ముందుగా ఈ ప్రాజెక్టు చేయడానికి బన్నీ ఆసక్తిని చూపించాడని అంటున్నారు.