మండుతున్న అగ్నిపర్వతాన్ని అధిరోహించే సాహసం... తీవ్రగాయాలపాలైన హైదరాబాద్ యువకుడు
- ఇండోనేషియాలో ప్రమాదం
- ఆసుపత్రిపాలైన పెద్దినేని సాయితేజ
- 2014 నుంచి అగ్నిపర్వతాలు అధిరోహిస్తున్న వైనం
ఆ పర్వతాన్ని సరైన దిశలో అధిరోహించడంలో పొరబడ్డాడు. క్లిష్టమైన మార్గంలో వెళ్లడంతో మండుతున్న లావా ఎదురైంది. ఈ క్రమంలో తప్పించుకోలేక గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం సాయితేజ ఇండోనేషియాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయితేజకు సాహసాలంటే మక్కువ. జీవితంలో ఏదైనా సాధించాలన్న తపనతో 2014 నుంచి ప్రపంచంలోని అనేక ప్రముఖ అగ్నిపర్వతాలను అధిరోహిస్తున్నాడు. రెండేళ్లలో 12 పర్యాయాలు వాల్కనో ట్రెక్కింగ్ చేశాడు.