utthej: జేడీ చక్రవర్తిని నేను ఇప్పటికీ తిడుతూనే వుంటాను: నటుడు ఉత్తేజ్

  • జేడీని వర్మకు పరిచయం చేశాను
  •  డైరెక్షన్ నీకెందుకని అంటాను 
  • నాకు నటన అంటే పిచ్చి

ఉత్తేజ్ మంచి నటుడు మాత్రమే కాదు .. మంచి రైటర్ కూడా. రామ్ గోపాల్ వర్మ .. కృష్ణవంశీ వంటి దర్శకుల సినిమాలకి ఆయన రైటర్ గాను పని చేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చాడు. "రామ్ గోపాల్ వర్మకి జేడీ చక్రవర్తిని నేనే పరిచయం చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు మా మధ్య ఆ స్నేహం అలాగే వుంది.

ఇప్పటికీ నేను జేడీ చక్రవర్తిని తిడుతూనే వుంటాను. 'నటనపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టి, హాయిగా సినిమాలు చేసుకునేదానికి ఎందుకురా మధ్యలో నీకు ఈ డైరెక్షన్లు? అంటూ వుంటాను. నిజానికి అది ఆయన వ్యక్తిగతం .. ఆయన ఇష్టం. నన్ను కూడా అందరూ మీరు చాలా మంచి రైటర్ .. మళ్లీ యాక్టింగ్ వైపు ఆలోచన ఎందుకు అంటారు. ఏం చేస్తాం నాకు నటనంటే పిచ్చి. ఇలా ఎవరి కారణాలు వాళ్లకి ఉంటాయి. ఎవరికి నచ్చిన దారిలో వాళ్లు వెళుతూనే వుంటారు" అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News