అరుదైన వ్యాధితో ఆసుపత్రిపాలైన హీరోయిన్ స్నేహా ఉల్లాల్
- ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్న స్నేహా ఉల్లాల్
- విపరీతమైన జ్వరంతో ఆసుపత్రిపాలు
- ఇన్ స్టాగ్రామ్ లో పోస్టుపెట్టిన నటి
ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా ఫలితం ఉండడంలేదని స్నేహా ఉల్లాల్ వాపోయింది. ఆసుపత్రి బెడ్ పై పడుకుని ఉండాలంటే విసుగొస్తోందని, అయితే, నెట్ ఫ్లిక్స్, కొందరు శ్రేయోభిలాషులు ప్రతిక్షణం వెంట ఉండడంతో నెట్టుకొస్తున్నానని తెలిపింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఆసుపత్రి బెడ్ పై తాను పడుకున్న ఫొటోలను అమ్మడు పోస్ట్ చేసింది.
స్నేహా ఉల్లాల్ తెలుగులో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో సింహా వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది. అనంతరం కొన్ని తెలుగు సినిమాల్లో చేసినా అవేవీ విజయవంతం కాలేదు. దాంతో ముంబయి మకాం మార్చింది. ఆమె చివరిగా 2014లో 'అంతా నీ మాయలోనే' చిత్రంలో నటించింది.