స్వలింగ సంబంధంలో ఉన్నట్టు వెల్లడించిన ద్యుతీపై తెలుగు సినీ దర్శకుడి స్పందన
- యూ ఆర్ ట్రూ చాంపియన్ అంటూ ట్వీట్ చేసిన రాహుల్ రవీంద్రన్
- అసాధారణ ధైర్యశాలి అంటూ కితాబు
- సంచలనం సృష్టించిన ద్యుతీ ప్రకటన
అయితే, టాలీవుడ్ యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ద్యుతీ నువ్వు నిజమైన విజేతవు అంటూ ట్వీట్ చేశారు. ద్యుతీ తన కెరీర్ లో ఎదురైన సమస్యలను, తన వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పిన తీరు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. 23 ఏళ్ల లేత ప్రాయంలోనే ఎన్నో కఠినసవాళ్లను ఎదుర్కొన్న ద్యుతీ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిందని రాహుల్ రవీంద్రన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.