'ఉప్పెన' నుంచి కొత్త స్టిల్ .. తెలుగు తెరకు మరో అందమైన కథానాయిక
- వైష్ణవ్ తేజ్ జోడిగా కృతి శెట్టి
- ఈ నెల 25 నుంచి షూటింగు మొదలు
- కీలమైన పాత్రలో విజయ్ సేతుపతి
ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా 'కృతి శెట్టి'ని ఎంపిక చేసుకున్నారు. 'సరిగమ' అనే కన్నడ సినిమా ద్వారా వెండితెరకి పరిచయమైన ఈ అమ్మాయి, ఆ తరువాత తమిళ సినిమాలను చేస్తూ వెళుతోంది. 'ఉప్పెన'తో ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఆకర్షణీయమైన కళ్లతో .. నాజూకుగా కనిపిస్తోన్న ఈ అమ్మాయికి, తెలుగు నుంచి మరిన్ని అవకాశాలు దక్కడం ఖాయమనిపిస్తోంది. 'ఉప్పెన'కి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తుండగా, విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషించనున్నాడు.