నన్ను సినిమాల్లోకి పంపించడానికి మా అమ్మ భయపడింది .. ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను: నటుడు ప్రదీప్
- నాటకాలు వేయడమంటే ఇష్టం
- మా నాన్న నన్ను ప్రోత్సహించారు
- జంధ్యాలగారు చూసి సినిమాల్లోకి రమ్మన్నారు
ఆ నాటకం చూసిన ఆయన, హీరోగా సినిమాల్లోకి వచ్చేయమని నన్ను అడిగారు. మరుసటి రోజు మా ఇంటికి వచ్చి అమ్మా నాన్నలను అడిగారు. " సినిమాల్లోకి వెళితే స్మోక్ చేయడం .. డ్రింక్ చేయడం .. చెడు స్నేహాలు చేయడం ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి .. అందువలన నేను పంపించను" అని మా అమ్మ తేల్చి చెప్పింది. 'అమ్మా .. అవే నీ భయానికి కారణమైతే ఎప్పటికీ వాటి జోలికిపోను .. సరేనా' అని మా అమ్మకి మాట ఇచ్చాను. ఇప్పటికీ ఆ మాటకి కట్టుబడే వున్నాను" అని ఆయన చెప్పుకొచ్చారు.