కోడి రామకృష్ణగారు నాకు విలన్ గాను .. హీరోగాను హిట్ ఇచ్చారు: భానుచందర్
- సంగీత దర్శకుడిని కావాలనుకున్నాను
- నటన వైపుకు నడిపించింది మా అమ్మనే
- 'ముక్కు పుడక'తో హీరోగా క్రేజ్
కానీ నేను నటన వైపుకు వెళ్లడం కరెక్ట్ అని మా అమ్మగారు నన్ను ఈ వైపుకు పంపించారు. తెలుగులో తొలి సినిమాగా 'నాలాగా ఎందరో' చేశాను. ఆ తరువాత 'మనవూరి పాండవులు'లో నటించాను. ఇక తెలుగులో నాకు బ్రేక్ ఇచ్చిన చిత్రం 'తరంగిణి'. కోడిరామకృష్ణగారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నేను చేసిన విలన్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన 'ముక్కు పుడక' నన్ను సోలో హీరోగా నిలబెట్టింది" అని చెప్పుకొచ్చారు.