కోట శ్రీనివాసరావుకు, నాకు ఆ దేవుడు ఒకే రకమైన శిక్ష వేశాడు: బాబూ మోహన్
- కోట ఇల్లు .. మా ఇల్లు పక్కపక్కనే
- ఇద్దరం అన్నదమ్ముల్లా ఉంటాము
- ఒకే కంచంలో భోజనం చేసేంత సోదరులమయ్యాము
ఎన్నో లక్షల మందిని నవ్వించిన మా ఇద్దరికీ 'విధి' ఒకే రకమైన శిక్ష వేసింది. కోట వారి అబ్బాయి .. మా అబ్బాయి రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. కోట కొడుకు ముందు బైక్ పై వెళుతుంటే .. వెనుక కార్లో భార్యాపిల్లలు వస్తున్నారు. వాళ్లు చూస్తుండగానే ఆ అబ్బాయికి ప్రమాదం జరిగింది. అలాగే మా పెద్దబ్బాయి బైక్ పై వస్తుంటే .. మా చిన్నబాబు వెనుక కార్లో వున్నాడు. చిన్నవాడు చూస్తుండగానే పెద్దాడికి ప్రమాదం జరిగింది" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.