'మామగారు' తరువాత నేను .. కోట కలిసి 100 సినిమాలు చేసుంటాము: నటుడు బాబూ మోహన్
- తమిళంలో సెంథిల్ - గౌండమణి చేశారు
- తెలుగులో నేను - కోట చేశాము
- మా కాంబినేషన్ లేని సినిమా వుండేది కాదు
"తమిళంలో హిట్ అయిన ఓ సినిమాను తెలుగులో 'మామగారు' పేరుతో తీశారు. తమిళంలో చెప్పుకోదగిన కమెడియన్స్ సెంథిల్ - గౌండమణిపై చేసిన కామెడీ ట్రాక్ అక్కడి జనానికి విపరీతంగా నచ్చేసింది. దాంతో అదే ట్రాక్ ను తెలుగులో పెట్టగా నేను - కోట కలిసి చేశాము. ఈ సినిమాతో మా కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఈ సినిమా తరువాత మా కాంబినేషన్లో 100 సినిమాల వరకూ వచ్చాయి. ఈ సినిమా తరువాతే కెరియర్ పై భరోసా కలగడంతో నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను" అని ఆయన చెప్పుకొచ్చారు.