300 ఉచిత ఐపీఎల్ టికెట్లు పంపండి... అంటూ లెటర్ రాసి చిక్కుల్లో పడ్డ ఎక్సైజ్ శాఖాధికారి!
- మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ అధికారిగా ప్రదీప్ రావు
- భారీ సంఖ్యలో టికెట్లు కావాలంటూ అఫీషియల్ లెటర్
- చార్జ్ మెమోను పంపించామన్న స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్
"12వ తేదీన జరిగే మ్యాచ్ కి సంబంధించిన టికెట్లను ఉన్నతాధికారులకు ఇచ్చేందుకు 300 టికెట్లను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను" అంటూ స్టాంప్, సీల్ వేసి మరీ ప్రదీప్ రావు లేఖను పంపారు. అయితే, ఆయనకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించిన హెచ్సీఏ, విషయాన్ని కమర్షియల్ టాక్సెస్ అండ్ ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లింది.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన, విచారణకు ఆదేశించామని, ప్రదీప్ రావుకు చార్జ్ మెమో పంపామని అన్నారు. కాగా, ఐపీఎల్ టికెట్లను ఉచితంగా కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వారిలో ప్రదీప్ మొదటి వారేమీ కాదు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ను ఇలాగే అడిగిన కేంద్ర ఉన్నతాధికారి గోపాల కృష్ణన్ గుప్తాను విధుల నుంచి తొలగించారు.