భావోద్వేగానికి గురైన 'అల్లరి' నరేశ్
- 'అల్లరి'తో కెరియర్ మొదలు
- ఇటీవల తగ్గిన హీరో అవకాశాలు
- 'మహర్షి'లో ముఖ్యమైన పాత్ర
ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో 'అల్లరి' నరేశ్ మాట్లాడుతూ .. 'మహర్షి' సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ .. నా పాత్రకి దక్కుతోన్న ఆదరణ ఆనందాన్ని కలిగిస్తున్నాయి. 17 సంవత్సరాల క్రితం మే 10వ తేదీన నా మొదటి సినిమాగా 'అల్లరి' వచ్చింది. ఆ సినిమాలో నేను 'రవి' అనే పాత్రను పోషించాను .. 'మహర్షి'లోను 'రవి' అనే పాత్రనే చేశాను. అందువలన ఈ సినిమాతో నా లైఫ్ ఫుల్ సర్కిల్ పూర్తయినట్టు నేను భావిస్తున్నాను" అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు.