ప్రభుదేవాతో కలిసి 'మహర్షి' చూడనున్న సల్మాన్
- మహేశ్ బాబు 25వ మూవీగా 'మహర్షి'
- హిందీ రీమేక్ పై సల్మాన్ ఆసక్తి
- తమిళ రీమేక్ పై విజయ్ దృష్టి
ఈ సినిమా నచ్చితే హిందీ రీమేక్ రైట్స్ తీసుకునే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసుకుని ఆయన రంగంలోకి దిగుతాడని చెబుతున్నారు. గతంలో మహేశ్ బాబు చేసిన 'పోకిరి' సినిమాను హిందీలో రీమేక్ చేసి సల్మాన్ హిట్ కొట్టేసిన సంగతి తెలిసిందే. అందువలన 'మహర్షి' కంటెంట్ పై ఆయన ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. ఇక తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయడానికి విజయ్ ఉత్సాహాన్ని చూపుతుండటం విశేషం.