నేను అప్పుడు దర్శకుడు సాగర్ గారి దగ్గర అసిస్టెంటును .. నా కోసం ఆయన కిందపడుకున్నాడు: వీవీ వినాయక్
- దర్శకుడు సాగర్ గారు ఎంతో మంచివారు
- నన్ను ఎప్పుడూ అసిస్టెంట్ లా చూడలేదు
- ఎంతో ప్రేమగా నన్ను చూసుకునేవారు
వృత్తిపరంగా నాకు గల అంకితభావం .. నేను పడే కష్టం .. నేను పెట్టే శ్రద్ధ సాగర్ గారికి తెలుసు. ఆయన దర్శకుడు .. నేను ఆయన అసిస్టెంట్ ను. నేను ఎప్పుడైనా బెడ్ పై పడుకుని నిద్రపోతే .. నన్ను లేపకుండా ఆయన కింద పడుకునేవారు. ఇది ఎవరి విషయంలో జరగదు .. నమ్మరు కూడా. నన్ను అంతగా ప్రేమించేవారు .. గౌరవించేవారు" అంటూ చెప్పుకొచ్చారు.