సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తప్పులు చేశానంటున్న రకుల్!
- 'జాక్ పాట్' కొట్టిన సూర్య భార్య
- రానా సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి
* తమిళ హీరో సూర్య తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రధారిగా తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి 'జాక్ పాట్' అనే టైటిల్ని నిర్ణయించినట్టు సూర్య తాజాగా వెల్లడించాడు.కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జ్యోతికతో పాటు రేవతి కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
* రానా, సాయిపల్లవి జంటగా 'విరాట పర్వం 1992' పేరిట ఓ పిరీడ్ డ్రామా తెరకెక్కనుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించే ఈ చిత్రంలో సీనియర్ బాలీవుడ్ నటి జరీనా వాహబ్ కీలక పాత్ర పోషించనున్నట్టు తాజా సమాచారం.