అవెంజర్స్ ఎఫెక్ట్ .. వాయిదాపడిన 'అభినేత్రి 2'
- నిన్న థియేటర్లకు వచ్చిన 'అవెంజర్స్ ఎండ్ గేమ్'
- 'అర్జున్ సురవరం' సినిమా వాయిదా
- మే 31కి వాయిదా పడిన 'అభినేత్రి 2'
అలా మే 1వ తేదీన విడుదల కావలసిన 'అర్జున్ సురవరం' సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక అదే రోజున విడుదల కానున్న 'అభినేత్రి 2' కూడా వాయిదా పడిందనేది తాజా సమాచారం. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను మే 31వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ రోజునే సూర్య 'ఎన్జీకే' ప్రేక్షకుల ముందుకు రానుందనే సంగతి తెలిసిందే.