కార్తికేయ కొత్త సినిమాకి డిఫరెంట్ టైటిల్
- కార్తికేయ తాజా చిత్రంగా 'హిప్పీ'
- తదుపరి చిత్రం అర్జున్ జంధ్యాలతో
- సంగీత దర్శకుడిగా చైతన్ భరద్వాజ్
అలా ప్రస్తుతం 'హిప్పీ' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే కార్తికేయ మరో సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి 'గుణ 369' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాకి సంగీతాన్ని అందించిన చైతన్ భరద్వాజ్, ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.