'అంధాదున్' రీమేక్ లో సిద్ధార్థ్, త్రిష
- హిందీలో హిట్ కొట్టిన 'అంధాదున్'
- తమిళ రీమేక్ కి సన్నాహాలు
- రాధికా ఆప్టే పాత్రలో త్రిష
క్రితం ఏడాది హిందీలో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న 'అంధాదున్' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ కథలో ఒక ప్రధానమైన పాత్ర కోసం సిద్ధార్థ్ ను ఎంపిక చేసుకున్నారు. మరో ప్రధానమైన పాత్రకి గాను త్రిషను సంప్రదించారనీ .. ఈ సినిమా చేయడానికి ఆమె అంగీకరించారని అంటున్నారు. హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్రను త్రిష చేయనుందని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా సిద్ధార్థ్ చెప్పడం విశేషం.