అల్లు అర్జున్ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోలు
- సెట్స్ పైకి అల్లు అర్జున్ 19వ సినిమా
- కథానాయికగా పూజా హెగ్డే
- కీలకమైన పాత్రలో 'టబు'
ఆ ఇద్దరిలో ఒకరు నాగార్జున మేనల్లుడు సుశాంత్ అయితే, మరొకరు నవదీప్. హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సుశాంత్ కి హిట్ పడలేదు. ఇక నవదీప్ కి కెరియర్ ఆరంభంలో ఒకటి రెండు సక్సెస్ లు వచ్చినా, ఆ తరువాత ఆయనకి అవకాశాలే లేకుండాపోయాయి. అలాంటి ఈ హీరోలిద్దరకీ ఈ సినిమాలో అవకాశం రావడం విశేషం. అమాయక చక్రవర్తి పాత్రలో సుశాంత్ కనిపించనున్నాడట. ఇక నవదీప్ పాత్ర ఎలా ఉంటుందనేది తెలియాల్సి వుంది. ఇక మిగతా పాత్రల్లో రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. రావు రమేశ్ కనిపించనున్నారట.