త్రిష ప్రధాన పాత్రధారిగా విభిన్న కథా చిత్రం
- మళ్లీ బిజీ అవుతోన్న త్రిష
- వరుసగా వస్తోన్న అవకాశాలు
- శరవణన్ సినిమాపై అంచనాలు
ఈ ప్రాజెక్టులలోనే ఆమె ప్రధాన పాత్రధారిగా చేసే సినిమా కూడా వుంది. మురుగదాస్ శిష్యుడు శరవణన్ .. ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. గతంలో ఆయన దర్శకత్వం వహించిన 'జర్నీ' ఏ స్థాయి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి మురుగదాస్ స్క్రిప్ట్ ను అందిస్తుండటం విశేషం. మురుగదాస్ సినిమాలకి ప్రధానమైన బలం ఆయన తయారుచేసుకునే స్క్రిప్ట్ అని అంటూ వుంటారు. అందువలన త్రిష చేసే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.