దిల్ రాజు నుంచి గిఫ్టుగా మరో దర్శకుడికి ఖరీదైన కారు
- వరుస విజయాలతో దిల్ రాజు
- దర్శకుడి కష్టం తెలిసిన నిర్మాత
- వేణు శ్రీరామ్ తో కొత్త ప్రాజెక్టు
దిల్ రాజు బ్యానర్లో వేణు శ్రీరామ్ చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్నాడు. దిల్ రాజుకి 'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో హిట్ కూడా ఇచ్చాడు. అలాంటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమా చేయాలనుకున్నారు. దాంతో తన దగ్గరున్న కథతో అల్లు అర్జున్ ను ఒప్పిస్తానని చెప్పి వెళ్లిన వేణు శ్రీరామ్, ఆ విషయంలో సక్సెస్ ను సాధించాడు. ఆయన వినిపించిన కథలోని కొత్తదనం నచ్చడంతో, త్రివిక్రమ్ సినిమా పూర్తికాగానే ఈ సినిమానే చేస్తానని అల్లు అర్జున్ మాట ఇచ్చేశాడు. అల్లు అర్జున్ వంటి పెద్ద హీరోను వెంటనే ఒప్పించినందుకుగాను వేణు శ్రీరామ్ కి దిల్ రాజు ఒక ఖరీదైన కారును గిఫ్టుగా ఇచ్చాడని అంటున్నారు.