సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కన్నడ సినిమాలో సాయిపల్లవి
- బన్నీ చిత్రంలో బాలీవుడ్ నటుడు
- నాట్యం నేర్చుకుంటున్న కథానాయిక
* అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం.
* తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ గా రూపొందే 'తలైవి' చిత్రంలో హిందీ నటి కంగన రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించే ఈ చిత్రం కోసం కంగన ప్రస్తుతం భరతనాట్యం నేర్చుకుంటోందట.